ఎన్నికల ముందు మద్య నిషేదం అంచెలంచెలుగా అమలు చేస్తామన్న వైస్ ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది. మొన్న జరిగిన టెండర్ల భాగోతం ఈ ప్రభుత్వ అసలు రూపం బయట పెట్టింది. మద్యం తమ పాలిట బంగారు బాతని భావిస్తోంది సర్కారు. ఆదాయం విపరీతంగా పెరగబోతున్నందుకు చంకలు గుద్దుకుంటోంది. అధినాయకుని తెలివితేటల్ని మంత్రులు, కాంగ్రెసు (వి)నాయకులు వేనోళ్ళ ప్రసంసిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు మూలధనం చేకూరినందుకు అమితోత్సాహంతో పండగ చేసుకుంటున్నారు. ఇదేమి అన్యాయం అన్న వాళ్లని అడుగులకు మడుగులొత్తే పోలిసుల సహకారంతో అరెస్టు చేయిస్తున్నారు. ఈ పాపం తమది కాదు అంతకు ముందున్న ప్రభుత్వానిదంటున్నారు. అంతేగాని తాము ప్రభుత్వంలోకి ఏ వాగ్ధానం చేసి వచ్చేరో మద్యం మత్తులో మరచిపోయారు. గాంధీకి రాజకీయ వారసులమని చెప్పుకునే ఈ కాంగ్రెస్, గాంధీ స్వరాజ్య సమరంతో పాటు మద్యానికి వ్యతిరేకంగా సమరం సాగించేడన్నది మరచిపోయారు. మరపు కాదు మదం. తమర్ని ఎవరూ ఏమీ చెయ్యలేరని ధీమా.
పులి తోలు కప్పుకుంటే నక్క పులి అవుతుందా. ఖద్దరు కట్టేసి, కండువాలేసుకొని, టొఫిలు పెట్టుకొంటే గాంధీ వారసులుకారు. పేరు చివర గాంధీ అని రాసేసుకుంటే వీళ్ళు గాంధీలు కాలేరు.
Thursday, June 19, 2008
మద్యం మత్తులో జోగుతున్న ప్రభుత్వం
Labels: గాంధీ వారసులు, మద్యం
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 12:55 AM
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
ఈ విషయంలో మనం యెవర్నీ సమర్దింలేకున్నామండీ కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ రెండే ఇప్పటికిప్పుడు బెల్టు షాపులకు వ్యతిరేకంగా తెలుగుదేశం వారు ప్రచారం చేస్తున్నారుకానీ వాతిని నెలకొల్పాలన్న ఆలొచన బాబుగారి మానసపుత్రిక దానికి ఆయన ఇంతవరకూ క్షమాపణ చెప్పింది లేదు. ఇక కాంగ్రెస్ అంటారా ఆనాటి రోశయ్య గారి దివ్య వాక్కులు గుర్తున్నాయా మద్యం వల్ల చేరిన నిధులతో మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారట. ఆరకంగా చూస్తే ఇంకా సరిపడిన్నన్ని నిధులు చేకూరలేదని అనుకోవలసివస్తుంది.
ఇక జనాలంటారా నిషేధిస్తే వీళ్ళు (మద్యోత్పోత్తికి) కుటీర పరిశ్రమలు స్తాపిస్తున్నారు ఐనా మనమీద ఆర్ధికపరంగా, ఆరోగ్యపరంగా మనకు లేని శ్రధ్ధ ప్రభుత్వానికి మాత్రం యెందుకు వుండలి?
Prabhutvaniki Madyam dvaaraane kadu, chala rakaala aadayalu generate chesukuntunnaru. Oka pakka krabaddekarana peruto konni kotlu prajala nundi gunjutunnaru. EE roju EEnadu paper lo chala manchi analysis icharu
Post a Comment