Thursday, June 26, 2008

చిందులువేయకురా కృష్ణా.....

ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికాఫీసులపై దాడులు తదనంతర పరిణామాలు కొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దలితనేతగా ఛలామనీ అవుతున్న మందకృష్ణమాదిగ వ్యవహారం ఏదో "మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు" ఉంది."బాడుగనేతల" శీర్షికతో తన రహస్యాలను బట్టబయలు చేసారన్న ఉక్రోషంతో ఆంధ్రజ్యోతి కార్యలయాల మీద తన అనుచరునలను ఉసిగొల్పి అక్కడ విధ్వంసకాండ చేయించి పైగా జర్నలిస్టులు తన దిష్టిబొమ్మను తగలపెట్టారని వాపోవడం.
ఈ విధ్వంసానికి కారకులైనవారి మీద ఏవో కేసులు పెట్టామని, చూస్తున్నామని పోలిసులు చెప్పడం, మందకృష్ణుని ఫిర్యాదుమేరకు "అట్రాసిటీ"చట్టం కింద ఆంధ్రజ్యోతి సంపాదకుడు, ఇద్దరు రిపోర్టర్లను అరెస్టు చేసామనని చెప్పడం ఇదంతా ఒక నాటకమని ప్రతిఒక్కరికి తెలుసు. ఇదంతా ప్రభుత్వంతో జతకూడి పోలిసులు చేస్తున్న పని అన్నది జగద్విదితం. ప్రతీ కధలోను ఒక నీతి ఉన్నట్టు, ఈ నాటక కధలో ఒక ప్రమాదకరమైన సంకేతం దాగి ఉంది. దలితులు అరాజకాలు చేసినా అది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కాదంటే "అట్రసిటీ" చట్టం క్రింద కేసులు పెట్టించి కాదన్నవారిని జైలుకు పంపవచ్చు. ఓట్లకోసం ఏ పాడుపనికైనా సిద్ధపడే ప్రభుత్వం ఇందుకు తన సహకారం ఇస్తుంది.దలితుడి దిష్టిబొమ్మ తగలపెడితే అది అన్యాయం. దలితుడు వేరేవాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెడితే అది వారికి చట్టం ప్రసాదించిన హక్కు. వాళ్ల హక్కులకోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తే మంచిదే. అంత మాత్రాన విద్రోహానికి పాల్పడటానికి ఏ రాజ్యాంగం వీరికి హక్కు ఇచ్చింది? పత్రికలు తమని, తమ చేష్టలని ఎప్పుడూ మెచ్చుకోవాలని అనుకుంటే అది అహంకారం మాత్రమే.
ఈ అహంకారం మందకృష్ణునికి బాగా తలకెక్కింది. నిప్పులు తొక్కిన కోతిలాగ గంతులు వేస్తున్నాడు."ఆంధ్రజ్యోతి" ఎండీని తక్షణమె అరెస్టు చెయ్యాలి లేదంటే ఆంధొలన తప్పదని, జర్నలిస్టు నాయకులు యాజమాన్యాలకు తొత్తులుఅనీ, చిరంజీవికి అమ్ముడు పోయారు అనీ, బాబు, కేసిఆర్ లను తిరగనివ్వం అనీ, గద్దర్ నువ్వు అసలు దలితుడవేనా అని - ఈ రకంగా చిందులు వేస్తున్నాడు.
ఈ ఉదంతం పత్రికాస్వేచ్ఛకు విఘాతం. పోలీసుల జులుంకి తార్కాణం. ప్రభుత్వ ఓటుబేంకు రాజకీయాలకు నిదర్శనం.

7 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ said...

వై.ఎస్స్ గారు వచ్చాక SC,ST అట్రాసిటి చట్టం విశ్వరూపం చూపిస్తోంది.దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నాయకులు blackmail చేయడం ఎక్కువయింది.

koumudi said...

taamu cheste sringaaram, edutivaadu cheste vyabhichaaram annatluga undi Manda Krishna vyavahaaram. Andolana peruto vaarite Patrika kaaryalayam meeda ekamga daadi chestaru, kaani edutivaaru nirasanaga disti bomma tagalabedite maatram , disti bomma ki kuda "Kulam" rangu pulumutaaru. Raastram lo Keechaka paalana unnatavaraku ilaaane untundi. Idi

సుజాత వేల్పూరి said...

బాగా చెప్పారు! మరి ఈ ప్రమాదకరమైన మెలిక ఇంకా ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తుందో! దీన్ని ఉదాహరణగా చూపించి ఏ దళితుడినన్నా కనీసం ఏకవచనంతో సంబోధించినా అదీ 'అట్రాసిటీ' అవుతుందేమో!

ఇందులో గద్దర్ నిజాయితీ ఎంతో కూడా మనం పరిశీలించాలి! కాసేపు తెలంగాణా వాదుల పక్కన కనిపిస్తాడు, మరి కాసేపు మంద కృష్ణ పక్కన, మరో సారి పత్రికా రంగం వైపు!

Anonymous said...

మనకెదురుగా కనబడుతున్నది చిందులేస్తున్న కృష్ణుడైనా..., నాటకానికి అసలు సూత్రధారి శివదేవుడే!

Kottapali said...

మీరు పెట్టే టైటిల్స్ భలే ఉంటున్నాయి :-)

పద్మనాభం దూర్వాసుల said...

విజయమోహన్ గారూ
ఈ చట్టం పాలకుల చుట్టం అయింది.కాని దళితులకు ఒరిగిందేమీ లేదు.
కౌముది, సుజాత,చదువరి, కొత్త పాళీ గార్లకు ధన్యవాదములు
పద్మనాభం

krishna rao jallipalli said...

ఈ చట్టం పాలకుల చుట్టం అయింది.కాని దళితులకు ఒరిగిందేమీ లేదు......
200% correst.