ఇది ఒక మంత్రి సోదరుని వీరంగం గాధ
రెండు రోజుల క్రితం రవాణా శాఖ కార్యాలయంలో వీరంగం చేసిన మంత్రి దివాకర రెడ్డి తమ్ముడు ప్రభాకర రెడ్డి ఉదంతం రసవత్తరమైన మలుపు తిరిగేటట్టుంది. తన ట్రావెల్స్ బస్సును సీజ్ చేసారన్న అక్కసుతో ప్రభాకరరెడ్డి అదనపు రవాణా కమిషనర్ సి.ఎల్.ఎన్.గాంధీపై నిప్పులు చెరగి నోటికొచ్చిన దుర్భాషలాడేరు. నిప్పులు తొక్కిన్ కోతిలా గెంతి నీ అంతు చూస్తా, ఒరేయ్, నా కొడుకా .... అంటూ ఊగి పోయారు. నీ యబ్బ.. నాబస్సులే సీజ్ చేస్తారా, వాడెబ్బ వాడొస్తే సంతకాలు చేస్తారా, మేం దొంగలమయ్యామా? మావి దొంగ బస్సులా ? వాటినిక్కడే తగలబెడతా! ఏమనుకుంటున్నారు, మీరు? కేశినేనితో ’గాంధీ’ కుమ్మక్కయ్యాడంటూ చిందులు తొక్కారు.
తర్వాత కార్యాలయం మెట్లపైనే ధర్నా చెయ్యడం, కమిషనర్ బుజ్జగించడంతో విరమించడం జరిగింది. అసలు కధ ఇక్కడే ప్రారంభమయింది. ప్రభాకరరెడ్డి ప్రవర్తనపై ఆగ్రహించిన ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. నిజానికి టివీలో ఈ ఉదంతం చూసిన ఎవరికైన జుగుప్స కలగడం సహజం. నిప్పులు తొక్కిన కోతిలా గెంతుతూ ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు వాగడం, విధినిర్వహణలో ఉన్న అధికారులను దూషించడం సహించరాని విషయం. TV 9 వారు నిన్న తమ ప్రోగ్రాంలో ఈ విషయంపై చర్చ జరుపుతూ, పనిలోపనిగా దేశ రాజధాని నుండి అప్పుడే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన మందకృష్ణమాదిగతో టెలిఫోన్ సంభాషణ జరిపేరు. ఇప్పటికే ఇటువంటి విషయాలలో ఆరితేరిన ఆయనకు విషయం విశదీకరించి ఇది కులం పేరుతో దూషించడం క్రింద వస్తుంది కాబట్టి ప్రభాకరరెడ్డిపై చట్టపరమైన ఎటువంటి చర్య తీసుకో వచ్చని అడిగేరు.ఈ సంభాషణ వింటూవుంటే మందకృష్ణ కన్నTV9కే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్టు అనిపించింది. ఇక మందకృష్ణునికి చేతినిండా పనే. TV9 కి కావల్సినంత కాలక్షేపం!
Thursday, July 31, 2008
అసలే కోతి, దానికి తోడు నిప్పులు తొక్కింది
Labels: commissioner, transport
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 7:49 AM
Subscribe to:
Post Comments (Atom)
1 వ్యాఖ్యలు:
నిన్న చర్చ పెట్టిన TV 9 వాళ్ళు ఇటువంటి విషయం ఏమయినా దొరుకుతుందా అని ఎదురు చూస్తారనుకుంటా. చిరంజీవి, రాజశేఖర్ వివదంలోను, మంద కృష్న విషయంలోను, సినిమాలలో దొర్లే చిన్న చిన్న తప్పుల (?) విషయంలోను గోరింతని, కొండింతలు చేయడం, కేవలం తమ పబ్లిసితీ పెంచుకోవడానికే అన్నట్లుంది.
Post a Comment