Monday, July 14, 2008

అయ్యో పాపం పసివాడు

సాక్షి దినపత్రికలో ఆదివారం ఏసుక్రీస్తును కించపరిచేలా ఉన్న చిత్రం ప్రచురితం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు నిరసన వ్యక్తంచేశారు. ఒకచేతిలో సిగరెట్టు, మరోచేతిలో మద్యం గ్లాసు ఉన్నట్లు ఏసుక్రీస్తు చిత్రాన్ని ప్రచురించడం క్రైస్తవులను అవమానించేలా ఉందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ క్రైస్తవ సంఘాలు సాక్షిపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. వెంటనే పత్రిక ఛైర్మన్‌ జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి.పత్రిక ఛైర్మన్‌ జగన్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు.కొన్ని చోట్ల సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేసారు.

అసలే వైస్ పైన గుర్రుగా ఉన్న "ప్రజా శాంతి పార్టీ" వ్యవస్థాపకుడు కె.ఆనంద్‌పాల్‌ గారు "తప్పుచేసిన వారికి క్షమించే గొప్పగుణం ప్రభువుకు ఉందని, అయితే ప్రభువు ఆత్మను కించపరిచినా, క్షోభపెట్టిన వారికి క్షమాపణ లేదనే విషయాన్ని బైబిల్‌ స్పష్టం చేసిందన్నారు. ఇది పొరపాటుగా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభువును ఒక వ్యసనపరుడిగా చిత్రించడం క్షమించరాని మహాపరాధంగా పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం, విలేకరులపై కేసులు పెట్టారని, ఇప్పుడు కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి పత్రిక ఎండీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. "

"ప్రభువా! క్షమించు" అంటూ పత్రికాధిపతి జగన్ సాక్షి 14వ తేదీ పత్రికలో వాపోయాడు.
తాజా వార్త ఏమిటంటే, తెలుగుదేశం ఎస్.సి సెల్ జగన్ పైన, మిగిలిన సాక్షి సంబంధిత అధికారులపైనా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

ఇదంతా చూస్తూ ఉంటే ఆనాడు, ఈ జగన్ పైసాచికానందంతో ఆంధ్రజ్యోతిపై విసిరిన విసుర్లు జ్ఙాపకం వస్తున్నాయి. ఆనాడు ఈ వైస్ పుత్రుడు "బాడుగ నేతలు అంటూ దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకే ఈ పరిస్థితి వచ్చింది. పత్రికలు మనం రాస్తున్న వార్తలు సరైనవేనా అని ప్రశ్నించుకోవాలని "అన్నాడు. ఇంకా ముందుకు పోయి "ఒకరిపై బురద జల్లే హక్కు మనకు లేదని, ఉన్నది ఉన్నట్లు రాయటమే మన భాద్యతని ఆయన పత్రికలకు నీతులు చెప్పేడు. మరి వీరు ఉన్నది ఉన్నట్టే చూపేరా? కళ్ళుమూసుకొనే కదా ఈ పని చేశారు! ఇది గురివింద గింజ సామెతలా ఉంది. అసలు తనేంటో, ఈ వైభవం వెనుక కధేంటో ప్రభువు సన్నిధిలో ప్రశ్నించుకోవాలి.

పసివాడా! అయ్యో పాపం పసివాడా! ఎరక్కపోయి అన్నావే ఇరుక్కుపోయావే!

7 వ్యాఖ్యలు:

Anil Dasari said...

వైఎస్సార్ కుడా క్రైస్తవుడే కదా. క్రీస్తుని కించపరిచే చిత్రం ఆయన సొంత పేపర్లో ఎలా వచ్చిందబ్బా? ఆ చిత్రం ఎక్కడన్నా ఉంటే మీ టపాకి జతచెయ్యగలరా? ఆ ఫొటోతో పాటు ఏదో ఒక వార్తో, వ్యాసమో ఉండి ఉండాలి కదా. ఏ సందర్భంలో అటువంటి చిత్రం ప్రచురించారో? విషయాన్ని out of context చేసి గొడవ చేస్తున్నారేమో?

మంద కృష్ణ విషయంలో నా బ్లాగులో ఓ టపా రాస్తూ జగన్ కి కూడా ఇలాంటి ఎదురుదెబ్బ ఎప్పుడో ఒకప్పుడు తగిలి తీరుతుందన్నా నేను. అదింత త్వరగా జరుగుతుందని అనుకోలేదు.

Kathi Mahesh Kumar said...

@ అబ్రకదబ్ర: out of context చేసినట్లే కనబడుతోంది. ఒక క్రైస్తవ ప్రచార వ్యాసం పైన ఈ ఫోటో పెట్టబడింది. ఎవరో ఇంటర్ నెట్ లో నుండీ డౌన్లోడ్ చేసి పెట్టారు. బొమ్మ చిన్నదిగా ఉండటం వలన సిగరెట్టు,బీర్ క్యాన్ ఆ DTP operator కు కనబడినట్లు లేవు.

ఎవరైనా తెలిసి తెలిసి ఈ మూర్ఖత్వం చేస్తారా? అదీ క్రైస్తవ ప్రచార వ్యాసం పైన కించపరిచే ఫోటో కావాలనే వేస్తారా?

ఈ లంకెద్వారా ఆ ఫోటోను చూడచ్చు. ఇలాంటి తప్పు మలేషియాలో కూడా జరిగిందట. ఈ ఫోటో చాలా పాప్యులారిటీనే తెచ్చుకుంది. its a good photo.

http://irregulartimes.com/index.php/archives/2007/08/23/jesus-beer-and-cigarette-image-to-start-your-own-religious-war/

పద్మనాభం దూర్వాసుల said...

మహేశ్ కుమార్ గారు చెప్పినట్టు ఫొటో నెట్ లోనుండి తీసుకొని, అదేంటో సరిగా చూడకుండానే వ్యాసం ప్రక్కన పెట్టేసారు.ఇది చేసింది వాళ్ళ సబ్ ఎడిటరే.అదృష్టం బాగుండి ఆమె క్రిష్టియనే అయింది. context కి కావల్సింది ఏసుక్రీస్తు బొమ్మే.బొమ్మ సెలక్షనే సరిలేదు.మహేష్ కుమార్ గారు చెప్పిన లింకు ముందే చూసాను.అది ఇంకా క్లియర్ బొమ్మ. ప్రస్తుతం సాక్షి సైటులో ఆ బొమ్మని తీసేసి వేరే బొమ్మ పెట్టేరు. ఈ లింకు చూడండి:
http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?newsid=7146&subcatid=25&categoryid=11

సుజాత వేల్పూరి said...

ఇది ఖచ్చితంగా out of context చేయడమే! నిజానికి ఆ అమ్మాయి సమీర (పాస్టరు కూతురట) బైబిల్లో ఉండె నీతికర విషయాలే ఆధ్యాత్మికం కింద రాసింది. కానీ మరి ఈ ఫోటో ఎలా డౌన్ లోడ్ చేసి పెట్టిందో(ఎందుకంటే ఫొటోకి, వ్యాసంలోని కంటెంట్ కీ సంబంధం లేదు)ఆమెకీ, జగన్ కీ తెలియాలి. అదీగాక, ఈ ఫొటో ప్రింట్ లో పెట్టేముందు చూసుకుని ఉండరు. బాధ్యత గల వారెవరైనా చూసి ఉంటే ఇదసలు పేపర్లో వచ్చేది కాదు.పెట్టకూడని ఫోటో అవునో కాదో గానీ మనకి మనోభావాలు ఎక్కువ కాబట్టి గొడవలు రేపే ఫోటోనే!

Unknown said...

ఏదైనా జగన్ బా కవర్ చేశారు, మొత్తం మీద

Bolloju Baba said...

the photo is out of content. it is a overlook. it need not be made a issue. i feel. the explanation is satisfying.
bollojubaba

Unknown said...

Thats ok, message in that news item(from preacher daughter) is, dont be so greedy, be happy with what you got, earn it with honesty and morals ani kada, at least Jagan got that part of the story?????
If so how come he still running the paper with the money where ever he got from ???