Sunday, July 6, 2008

భారతీయ సంస్కృతిని వెక్కిరిస్తున్న సూడోసెక్యులరిస్టులు

సెక్యులరిజానికి కొత్త భాష్యం

నిజానికి సెక్యులరిజమ్ అంటే మతాలతో ఏ విధమైన సంబంధమూ లేనిది - అది మెజారిటీ ప్రజలదైనా మైనారిటీ ప్రజలదైనా. సెక్యులర్ ప్రభుత్వం ప్రతీ వ్యక్తికీ రాజ్యాంగంలో నిర్వచించిన మౌలిక సూత్రాలకు లోబడి తాను నమ్మిన మతాన్ని ఆచరించే స్వేచ్చ యిస్తుంది. సెక్క్యులరిజం అన్నది మన భారతీయ సంస్కృతిలో పురాతనంగా వస్తూన్న సంప్రదాయమే. పరమత సహనం భారతీయ జీవనంలో ఒక అంతర్భాగంగానే ఉంది.దీనిని ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీలుగాని, మేధావులమని చెప్పుకునే విషయ పరిజ్ఙానం లేని పెద్ద మనుష్యులు గాని గొంతు చించుకొని చెప్పనక్కరలేదు.

1976 లో సవరణ చేసి సెక్యులరిజమ్ అన్న పదం చొప్పించక ముందు కూడా మన రాజ్యాంగం మతాతీతమైనదే. ఈ సవరణ వెనుక ఉన్న దుర్ణీతి త్వరలోనే బయట పడింది.
సెక్యులరిజం అన్న పదానికి విపరీత భాష్యాలను చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దాని స్వరూప స్వభావాలనే మార్చేసారు. మైనారిటీలను ఆకట్టుకొని తమ వోటు బేంకుని విస్తృత పరచుకుందుకే ఈ రాజ్యాంగ సవరణ వాడుకోవటం ప్రారంభించారు. ఈ "సూడో సెక్యులరిస్టు" పార్టీలు ఈ పదానికి వేరే అర్ధాన్ని ఆపాదించి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి. సెక్యులరిజమ్ అంటే మైనారిటీలను దువ్వడం, వారికి ఏవో తాయిలాలు ప్రకటించడం అన్న భావన కలిగించేరు. వారికి మతపరంగా కొన్ని సదుపాయాలను కల్పించటం రివాజు అయిపోయింది. ఈక్రమంలో హిందూమతానికి చెందినవారిని పూర్తిగా వెనక్కినెట్టేసారు. వారికి ఏవైనా సౌకర్యాలు కల్పించడమంటే మైనారిటీలను అగౌరవపరచడం "సెక్యులరిజం" పాటించకపోవడం అన్న విపరీత అర్ధాన్ని లేవనెత్తేరు.

ఈ నాడు కాంగ్రెస్, లెఫ్ట్ మరియు వాటి తోక పార్టీలు. అధికార పీఠం అధిష్టించడానికి ఏ నీచానికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నారు.దేశంలో ఉన్న హిందూ ధార్మిక సంస్తల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. వాటి నిర్వహణ; చివరకు వాటి ఆదాయం ఖర్చు విషయాలను ప్రభుత్వమే నిర్దేసిస్తోంది.
ఇది ఎంతవరకు పోయిందంటే తిరుమల తిరుపతి దేవస్తానం చైర్‍మన్ గా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండటం ఈమధ్య తమ పదవులు పోకుండా నిలుపుకోటానికి చేసిన "ఆఫీస్ ఆప్ ప్రాఫిట్" చట్టం ప్రకారం ప్రశ్నించలేని హక్కుగా చేసేసారు. అలాగే తామేదో దేశ సెక్యులర్ వ్యవస్తకు రక్షకభటులమని కాలరెగరేస్తున్న కేరళలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం శబరిమలై నిర్వహణలో వేలుపెట్టటానికి ప్రయత్నిస్తోంది. కళ్ళుండీ తన నల్ల కళ్ళజోడు నుండి చూడలేని గుడ్డివాడు తమిలనాడు ముఖ్యమంత్రి ఒక వదరబోతుగా ప్రవర్తించాడు. రాముడు ఏ కాలేజిలో చదివేడు? రాముడు తాగుబోతు కాదా? ఇటువంటి కుళ్ళుబోతు ప్రశ్నలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతిసే ప్రయత్నంచేశాడు.

ఇది అదనుగా తీసుకొని ఈ నాడు ( కేంద్ర, రాష్ట్ర ప్ర్భుత్వాల ప్రొత్సాహంతో) క్రిష్టియన్ మిషనరీలు హిందువులను, ముఖ్యంగా గిరిజనులను మతమార్పిడికి గురుచేస్తున్నారు. తిరుపతిలో, పద్మావతీ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలు ఈ నీచ ప్రవృత్తికి నిదర్శనాలు.

హిందూధర్మాన్ని ఎంత కించ పరుస్తే అంత గొప్ప సెక్యులరిజం అని వీళ్ల అభిప్రాయం. ఇదే తమకు ఓట్లు రాలుస్తుందని వీళ్ళ నమ్మకం. ఇంత నీచ సంస్కృతిని సెక్యులరిజం అనడం ఇంకా నీచం. ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళూ, కమ్యునిస్టులు, వాళ్ళ తోకలు ప్రస్తుతం గుర్తెరిగే స్తితిలో లేరు. వీరంతా సెక్యులరిజం ముసుగులో భారతియ సంస్కృతిని వెక్కిరిస్తున్న జాతి విద్రోహులు.

4 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

మీరు రెండు మూడు విషయాలు కలగలిపి పాట్లాడుతున్నట్టున్నారు. మన రాజ్యాంగం సెక్యులరిజం చర్చ వేరు,రాజకీయాల్లో సెక్యులరిజం ఉపయోగం వేరు, ఇక ‘గుడి వ్యాపారాలలో’ రాజకీయనాయకుల జోక్యం వేరు.

కాంగ్రెస్ చేసేది minority appeasement అయితే, మీరు చెప్పక చెప్పిన బీజేపీ ది minority hatred రెండూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే! ప్రజలకు ప్రాణసంకటమే!ఖండనీయమే!

Rajendra Devarapalli said...

ఎన్నికలు, ముఖ్యంగా లోక్ సభకు వస్తున్నాయి అనగానె తరచూ వినబడే మాట ఈ సూడో సెక్యులరిస్టులు.

durgeswara said...

kaaraNamu telisinadE mIkaaryaacharaNa praarambhimchamdi

GKK said...

మన హిందూమతానికి చెరుపు చేస్తున్నది కొంతమంది హిందువులు,జర్నలిస్టులు,కమ్యూనిస్టులు మరియు రాజకీయ నాయకులు. ముఖ్యంగా మీడియాలోని చాలామంది పుండాకోర్ వెధవలు హిందుమత ద్వేషులు.

మీ వ్యాసం వాస్తవానికి అద్దం పట్టింది.